Monday, December 23, 2024

రష్యా అణుదాడి నివారణలో భారత్ చైనా కీలక పాత్ర?

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి జరుగకుండా చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించారని సిఎన్‌ఎన్ నివేదికలో వెల్లడైంది. ఓ అమెరికా అధికారి చెప్పిన వివరాల మేరకు సిఎన్‌ఎన్ తన నివేదిక రూపొందించింది. ఓ దశలో ఉక్రెయిన్‌పై అణుబాంబు వేయాలని రష్యా సంకల్పించింది. యుద్ధంలో పలు ఎదురుదెబ్బల దశలో ఈ తీవ్ర చర్యకు రష్యా నేత పుతిన్ ఆలోచించారు. విషయాన్ని అమెరికా ఇంటలిజెన్స్ సంస్థలు గుర్తించి , నివాచరణకు చొరవ తీసుకోవాలని భారత్, చైనా అధినేతలకు సూచించారు.

ఈ క్రమంలో మోడీ , చైనా అధినేత జిన్‌పింగ్ వేర్వేరుగా తగు విధంగా స్పందించి ఉంటారు. భారత్ చైనాలే కాకుండా ఇతర వర్గాల నుంచి కూడా పుతిన్‌పై ప్రభావం పడి ఉంటుంది. ఈ క్రమంలోనే పెను ముప్పు తప్పిందని తాము భావిస్తున్నట్లు అమెరికా అధికారి చెప్పినట్లు సిఎన్‌ఎన్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడి దశలో రష్యా చర్యను భారత ప్రభుత్వం నేరుగా ఏ దశలోనూ ఖండించలేదు. భారత్‌ను రష్యా మిత్రపక్షంగా ఎంచుకున్నందునే అణుదాడి విషయంలో మోడీ మాటను రష్యా అధినేత పట్టించుకుని ఉంటారని సిఎన్‌ఎన్ నివేదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News