Monday, December 23, 2024

ప్రణీత్‌రావుకు బిగుస్తున్న ఉచ్చు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: గత ప్రభుత్వంలో పనిచేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్‌ఐబి) మాజీ డిఎస్‌పి ప్రణీత్‌రావు, అతడికి సహకరించిన వారిపై పం జాగుట్ట పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డి ఎస్‌పి ప్రణీత్ రావుపై ఎస్‌ఐబి అదనపు ఎస్‌పి డి.రమేష్ ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పం జాగుట్ట పోలీసులు ప్రణీత్‌రావు, అతడికి సహకరించిన వారిపై 409,427,201, 120బి, రెడ్‌విత్ 34 ఐపిసి, 3 పిడిపిపిఏ, 65,66,70 ఐటిఏ యాక్ట్ కింద కేసు న మోదు చేశారు. ఎస్‌బిలో ఇన్‌స్పెక్టర్‌గా చే రిన దుగ్యాల ప్రణీత్‌రావుకు 2023లో డి ఎస్‌పిగా యాగ్జిలరీ ప్రమోషన్ ఇచ్చా రు. ఎస్‌బిఐలోని రెండు గదుల్లో ప్రణీత్ రావు తనకు సంబంధించిన వారితో విధులు నిర్వర్తించేవాడు. వీరు మొత్తం 17 కంప్యూటర్లు వినియోగించారు. వీటి ద్వారా అనధికారికంగా రహస్య సమాచారం సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల ఎస్‌ఐబి అధికారులు ప్రణీత్‌రావు ఉపయోగించిన కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా కీలకమైన డాటా మాయం అయినట్లు గుర్తించారు.

ఎలక్ట్రానిక్ డివైజ్‌ల్లోని డాటా, ఇతర డాక్యుమెంట్లు మాయం కావడంతో పోలీస్ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత డిసెంబర్ 4, 2023 రాత్రి ఎస్‌ఐబి కార్యాలయానికి వచ్చిన ప్రణీత్ రావు కంప్యూటర్లలో ఉన్న డాటాను తన వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌ల్లో కాపీ చేసి మిగతా వాటిని ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల ఫలితాల తెల్లవారే కార్యాలయానికి వచ్చిన తర్వాత సిసి కెమెరాలను ఆపివేసి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబిలో డిఎస్‌పిగా పనిచేసిన ప్రణీత్‌రావును డిజిపి రవిగుప్తా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బిఆర్‌ఎస్ హయాంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది. ఫోన్ ట్యాపింగ్ నిజమని తేలడంతో సస్పెండ్ చేస్తూ డిజిపి రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News