Monday, December 23, 2024

ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

భార్యను హతమార్చిన భర్త

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. నగరానికి చెందిన అశోక్ రాజ్, శ్వేతకు వివాహం జరిగింది. తర్వాత ఇద్దరు కలిసి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి విక్టోరియాలోని బక్లీలో స్థిరపడ్డారు. వీరికి కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో అశోక్ రాజ్ భార్య శ్వేతను హతమార్చి రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తడబ్బాలో మృతదేహాన్ని పడేశాడు. చెత్తడబ్బాలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యను హత్య చేసిన తర్వాత అశోక్ రాజ్ కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. హైదరాబాద్‌లోని అత్తగారింట్లో కుమారుడిని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు అశోక్ రాజ్ శ్వేతను హత్య చేసినట్లు నిర్ధారించారు. భార్యను హత్య చేసిన అశోక్ రాజ్‌ను విక్టోరియా పోలీసులు అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News