Saturday, November 23, 2024

అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో భారత్

దుబాయ్ : ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 41తో ఘనంగా ముగించిన టీమిండియా ఐసిసి ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. టెస్టుల, వన్డే, టీ20 ఫార్మాట్‌లోనూ భారత్ టాప్‌లో ఉంది. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 1-1తో ముగించడంతో టీమిండియా ఫస్ట్ ర్యాంక్‌ను కోల్పోయిన భారత్ ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో తిరిగి టాప్ ర్యాంక్ నిలుపుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల టెస్టుల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుంది.

122 రేటింగ్ పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరింది. 117 పాయింట్లతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టులో ఆసీస్ విజయం సాధించినప్పటికీ భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ 121 పాయింట్లతో టాప్‌లో ఉంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో 266 పాయింట్లతో టీమిండియా ఫస్ట్ ర్యాంక్‌లో, 256 పాయింట్లతో ఇంగ్లండ్ సెకండ్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి.

Team India top in three formats

అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 68.51 గెలుపు శాతంతో టాప్‌లో ఉంది. డబ్లుటిసిలో ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆరు విజయాలు సాధించి, రెండింటిలో పరాజయం పాలైంది. ఓ మ్యాచ్ డ్రాగా ముగించి 74 పాయింట్లు సాధించింది. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 60 విజయశాతంతో 36 పాయింట్లు సాధించింది. 10 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ మూడు విజయాలతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News