Friday, December 20, 2024

Ascar Awards: నగ్నంగా వేదికపైకి వచ్చిన హాలీవుడ్ స్టార్!

- Advertisement -
- Advertisement -

లాస్ ఎంజెల్స్: 96వ ఆస్కార్ అవార్డు వేడుక ఘనంగా ప్రారంభమైంది. హాలీవుడ్ సూపర్ స్టార్ రెజ్లర్ జాన్ సీనా నగ్నంగా వేదికపై పైకి వచ్చి విన్నర్స్‌ను ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ మారింది. 1974లో ఆస్కార్ వేడుకలు జరుగుతుండగా ఒక పురుషుడు నగ్నంగా వేదికపైకి రావడంతో అక్కడ ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. అప్పడు డేవిడ్ నివ్విన్ వేదిక పైకి రావాలని ఎలిజిబెత్ టేలర్ పిలుస్తుండగా ఓ వ్యక్తి నగ్నంగా వేదికపై పరుగులు తీశాడు. 50 సంవత్సరాల తరువాత విజేతలను ప్రకటించే వ్యాఖ్యాత నగ్నంగా స్టేజీ పైకి రావడమనేది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దిగంబరంగా వేదికపైకి వస్తే ఎలా ఉంటుందో ఊహించారా? పిచ్చితనంగా అనిపిస్తుందా? అని ప్రశ్నించాడు. వేదిక వెనక నుంచి జాన్ సీనా పలుకులు వినిపించడంతో మరో వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ స్పందించారు.

వేదికపైకి నగ్నంగా రావడం తనకు ఇష్టం లేదని, పురుషుడి శరీరం జోక్ కాదని జాన్ సీనా తెలిపాడు. జిమ్మీ, సీనా కొంచెం సేపు మాట్లాడిన తరువాత ఓ ఎన్వలప్‌ను అతడి చేతి పెట్టి అవార్డులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అట్ట ముక్కను అడ్డం పెట్టుకొని నగ్నంగా జాన్ సీనా వేదికపైకి రావడంతో అతిథులు పెద్ద ఎత్తున నవ్వుతూ చప్పట్లు కొట్టారు. మైక్ ముందుకొచ్చి ఎన్వలప్‌ను ఓపెన్ చేయలేనని జాన్ వివరణ ఇచ్చాడు. దీంతో జిమ్మీ అక్కడికి వచ్చి నామినేషన్లను ప్రకటించారు. అదే సమయంలో కొందరు సహాయకులు వేగంగా అక్కడకు చేరుకొని జాన్ సీనాకు దుస్తులు తొడిగారు. పూర్ థింగ్స్ అనే సినిమాకు ఉత్తమ కాస్టూమ్స్ డిజైన్‌తో పాటు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ మేకప్ అవార్డులను ఆయన ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News