Monday, December 23, 2024

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త, దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ సోమవారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై సౌత్ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. సూర్యకిరణ్.. బుల్లితెర ప్రముఖ నటి సుజిత సోదరుడు.

కాగా.. తెలుగులో సత్యం, ధన 51, రాజుభాయ్‌ వంటి సినిమాలకు సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు. తెలుగు బిగ్ బాస్ 4వ సీజన్ లోనూ ఆయన పాల్గొన్నారు. మొదట నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగమొగుడు, ఖైదీ, కొండవీటి దొంగ చిత్రాలతోపాటు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ సినిమాలలోనూ సూర్యకిరణ్ నటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News