ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్ లోకి దూసుకు వచ్చేసింది. దేశంలోనే తొలి కృత్రిమ మేథ రోబో టీచర్ కేరళ పాఠశాలలో పాఠాలు చెప్పడం ప్రారంభించింది. తిరువనంతపురంలోని ఓ స్కూల్లో రోబో టీచర్ ఐరిస్ రంగప్రవేశంతో విద్యార్థులు ఆనందంతో పులకించిపోయారు. తొలి ఏఐ టీచర్ కదలివచ్చి .. తమకు షేక్ హ్యాండ్ ఇస్తూ.. పలకరించేటప్పటికి విద్యార్థులు థ్రిల్లయిపోయారు. జనరేటివ్ ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మేకర్స్ ల్యాబ్ ఈ రోబో టీచర్ ను రూపొందించింది.
కేరళలోని కేటీసీటీ హయ్యర్ సెకెండరీ స్కూల్లో రోబో టీచర్ ఆవిష్కరణ జరిగింది. తరగతి గదిలో రోబో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయింది. ఏఐ టీచర్ ఐరిస్ ను విఎస్ఎస్సీ స్పేస్ ఫిజిక్స్ లేబొరెటరీ డైరెక్టర్ డాక్టర్ కె రాజీవ్ ఆవిష్కరించారు. రోబో ఐరిస్ టీచర్ ద్వారా వ్యక్తిగత విద్యాబోధనకు అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థి అవసరాలు, ప్రాధాన్యాతలకు అనుగుణంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతిభావంతంగా పాఠాలు చెబుతుందంటున్నారు రూపకల్పన చేసిన మేధావులు.