Friday, December 20, 2024

రీట్వీట్ కేసులో క్షమాపణ చెపుతారా?: కేజ్రీవాల్‌కు సుప్రీం ప్రశ్న

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వివాదాస్పద వీడియో రీట్విట్, సంబంధిత పరువునష్టం దావా విషయంలో సుప్రీంకోర్టు సోమవారం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ వివరణ కోరింది. ఈ కేసు విషయంలో క్షమాపణలు తెలియచేయాలనుకుంటున్నారా? అని సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. కేసులో ఫిర్యాదీకి క్షమాపణ చెపుతారా? లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆదేశించింది. యూట్యూబర్ ధృవ్ రాథీ బిజెపి ఐటి సెల్‌పై తప్పుడు, ప్రతిష్టను దెబ్బతీసే వీడియో వెలువరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని తాను రీట్వీటు చేయడం ద్వారా తప్పిదానికి పాల్పడినట్లు ఫిబ్రవరి 26వ తేదీన సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ తెలియచేసుకున్నారు.

పరువునష్టం దావాలో తనను నిందితుడుగా చేరుస్తూ వెలువడ్డ సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీనిని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసుపై సోమవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారించింది. కేజ్రీవాల్‌పై ఫిర్యాదుకు దిగిన వికాస్ సంకృత్యయాన్ తరఫు న్యాయవాదులు తాము కేజ్రీవాల్ క్షమాపణ ఎక్స్ సామాజికి మాధ్యమంలో కానీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కానీ వెలువరించాలని కోరుతున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News