Sunday, January 19, 2025

కాంగ్రెస్ వచ్చింది… కరువు తెచ్చింది: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చి మళ్లీ కరువు తెచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గంలోని ముఖ్య నాయకులతో నిర్వహించిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌వి ఉద్దెర హామీలే తప్ప నగదు హామీలు కావన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్లీ కరవు మొదలైందన్నారు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కనుమరుగైన బోరుబండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని మళ్లీ వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఎటుచూసినా కరెంట్, నీటి కష్టాలే కనబడుతున్నాయని అన్నారు. రైతుల విషయంలో కెసిఆర్‌కు ఉన్న ప్రేమ కాంగ్రెసోళ్లకు ఉండదన్నారు. రైతుబంధు, నిరంతర విద్యుత్, పంటకు బోనస్ విషయంలో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల పట్ల అవలంబిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నేరవేరాలంటే బిఆర్‌ఎస్ ఎంపి స్థ్ధానాలలో గెలవాల్సిందేనని అన్నారు.

సగం మంది రైతుబంధు ఇవ్వనోళ్లు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హామీలపై బాండ్లు రాసి ఇచ్చారే తప..్ప గెలిచాక ముఖం చాటేశారన్నారు. కాంగ్రెస్‌కు దేశంలో కనీసం ప్రతిపక్ష హోదా సైతం రాదన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. వృద్ధులకు డిసెంబర్ నుంచి రూ. 4 వేల ఫించన్ ఇస్తామని చెప్పారని, కానీ మూడు నెలలైనా ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మిపథకంలో తులం బంగారం ఇస్తామని ఇవ్వడం లేదన్నారు. భవిష్యత్తులో సగం మంది రైతులకు కోత విధిస్తారన్న అనుమానాలు ఉన్నాయన్నారు.కేంద్రంలోని బిజెపి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణకు మెడికల్ కాలేజ్, నవోదయ పాఠశాలలను కేంద్రంలో ఉన్న ఇవ్వలేదని ఆరోపించారు. వచ్చే ఎంపి ఎన్నికలలో బిజెపి, కాంగ్రెసోళ్లకు ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేసి బిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News