- Advertisement -
మధ్యయుగ కాలం నాటి భోజ్‌శాల సముదాయంపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఉన్న ఈ 11వ శతాబ్ధపు కట్టడం ఎఎస్‌ఐ పరిరక్షణలో ఉంది. ఈ కట్టడంపై చాలా కాలంగా వివాదం ఉంది. ఇక్కడ వాగ్దేవి సరస్వతి దేవీ ఆలయం ఉందని హిందువులు విశ్వసిస్తారు. కాగా ముస్లిం వర్గాలు ఇక్కడ కమల్ మౌలా మసీదు ఉందని చెపుతారు. తమకు న్యాయం కావాలని హిందూ ఫ్రంట్ కోర్టుకు వెళ్లింది. కేసుపై తదుపరి విచారణ ఎప్రిల్ 29కి వాయిదా వేశారు. ఇప్పటివరకూ ఇక్కడ ఉన్న కట్టుబాట్ల ప్రకారం హిందువులు ఇక్కడ మంగళవారాలలో సరస్వతి దేవీ పూజలు చేస్తారు. కాగా ముస్లింలు శుక్రవారాలలో నమాజులు జరుపుతారు.
- Advertisement -