విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆతిథ్య ముంబై జట్టు పటిష్ఠస్థితికి చేరుకుంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 45.3 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ముంబై సోమవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా (11), భూపెన్ లల్వాణి (18) ఆరంభంలోనే పెవిలియన్ చేరారు. అయితే ముషీర్ ఖాన్, కెప్టెన్ అజింక్య రహానెలు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు విదర్భ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు.
ముషీర్ ఖాన్ 3 ఫోర్లతో 51 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. రహానె 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబై ఆధిక్యం 260 పరుగులకు చేరింది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 105 పరుగులకే కుప్పకూలింది. యశ్ రాథోడ్ (27), ఓపెనర్ అతర్వ టైడ్ (23), ఆదిత్య (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ముంబై బౌలర్లలో శమ్స్ ములాని, ధవళ్ కులకర్ణి, తనూష్ కొటియాన్ మూడేసి వికెట్లను పడగొట్టారు. కాగా, ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌటైంది.