Monday, December 23, 2024

అత్తను రాయితో కొట్టి చంపిన కోడలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: అత్తను కోడలు చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్తూరు పంచాయతీ దేవీనగర్‌లో ఈగల సింహాద్రమ్మ- సన్యాసిరావు అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు గణేశ్‌కు 16 ఏళ్ల క్రితం పూర్ణతో పెళ్లి చేశారు. అత్తా కోడలు ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉండడంతో పలుమార్లు ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి. సంవత్సరం క్రితం కోడలు పూర్ణ అత్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఇద్దరికి పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

మళ్లీ కోడలుతో అత్త గొడవ పెట్టుకోవడంతో కుటుంబ సభ్యులుపై దిశ పోలీస్ స్టేషన్‌లో వరకట్నపు కేసు పెట్టింది. దీంతో పోలీసులు అత్తా కోడలు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. సోమవారం కోతులు ఇంట్లోకి రావడంతో అత్తాకోడలు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో పూర్ణ రాయి తీసుకొని అత్త తలపై బాదింది. అత్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. వెంటనే కోడలు ఇంట్లో నుంచి పారిపోయింది. సన్యాసిరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News