Tuesday, December 3, 2024

సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: మూడు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ కు చెందిన తడక శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ కు ఇద్దరు కూతుళ్లు అనుష, అక్షయలు ఉన్నారు. తడక శ్రీనివాస్ గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నాడు. పనిలో వచ్చిన డబ్బులతోనే మందులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే సమయంలో గత మూడు నెలలుగా సిరిసిల్ల పట్టణంలో చేనేత పరిశ్రమలో పనులు లేక ఇబ్బందులకు గురయ్యాడు. మందులు లేని స్థితిలో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News