Friday, December 20, 2024

కేంద్రం లేఖలకు కెసిఆర్ ఎందుకు స్పందించలేదు: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కేంద్రం నిధులు ఇచ్చినా… బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలేదని బిజెపి ఎంపి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిధులను కెసిఆర్ ఇతర కార్యక్రమాలకు మళ్లించారని, నిధుల మళ్లింపుపై గతంలో కేంద్రం లేఖలు రాసిందని, కేంద్రం రాసిన లేఖలకు అప్పటి ప్రభుత్వం ఎందుకు బదులివ్వలేదని బండి సంజయ్ నిలదీశారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చిందని బిజెపి అని తెలియజేశారు. కేంద్రం మూడు సార్లు లేఖలు రాసినా కెసిఆర్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని అడిగారు. కేంద్రం స్మార్ట్ సిటీ ఇస్తే తామే తెచ్చామని కెసిఆర్ అబద్దాలు చెబుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News