Friday, December 20, 2024

ఐదేళ్లలో 22వేల ఎన్నికల బాండ్లు జారీ

- Advertisement -
- Advertisement -

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో దిగివచ్చిన ఎస్బీఐ.. మొత్తానికి బాండ్ల వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు ఒక పెన్ డ్రైవ్ లో బాండ్ల వివరాలను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసింది.

2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకూ మొత్తం 22,217 బాండ్లు జారీ చేసినట్లు ఎస్బీఐ పేర్కొంది. వీటిలో 22,030 బాండ్లను వివిధ రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. మిగతా 187 బాండ్ల నగదు ప్రధాని రిలీఫ్ ఫండ్ కు జమ అయింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ, ఇప్పటివరకూ జారీ చేసిన బాండ్లు, వాటివల్ల లబ్ధి పొందిన రాజకీయ పార్టీల వివరాలను ఈనెల 12వ తేదీలోగా అందజేయాలని ఆదేశించింది. అయితే ఈ వివరాల అందజేతకు ఎస్బీఐ గడువు కోరడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎస్బీఐ దిగివచ్చి, సంబంధిత వివరాలను కోర్టుకు అందజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News