- Advertisement -
గ్యాంగ్ స్టర్, ఉత్తరప్రదేశ్ మాజీ ఎంపీ ముఖ్తార్ అన్సారీకి 1990 ఆయుధాల అక్రమ లైసెన్స్ కేసులో వారణాసి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అన్సారీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి ఆయుధాల లైసెన్స్ పొందినట్లు దాఖలైన కేసులో కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. అన్సారీకి కోర్టు రూ.2.20 లక్షల జరిమానా కూడా విధించింది. అన్సారీ 1986లో అప్పటి ఘాజీపూర్ డీఎం, ఎస్పీల సంతకాలను ఫోర్జరీ చేసి డబుల్ బ్యారెల్ గన్ లైసెన్స్ పొందాడు.
వాస్తవాలు 1990లో వెలుగులోకి రావడంతో ఆయనపై ఘాజీపూర్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం కేసు విచారణను సీబీఐకి అప్పగించారు. అన్సారీపై మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. 2022 సెప్టెంబర్ నుంచి అన్సారీకి పడిన శిక్షల్లో ఇది ఎనిమిదవది.
- Advertisement -