Friday, December 20, 2024

బిజెపి రెండో జాబితాలో ఆరుగురికి చోటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వచ్చే లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్థుల రెండవ జాబితాను బిజెపి విడుదల చే సింది. 72 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బుధవారం ప్రకటించింది. ఈ లిస్టులో తెలంగాణలో 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ డికె అరుణ, మె దక్ రఘునందన్ రావు, నల్లగొండ శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ గొండు నగేష్, మహబూబాబాద్ సీతారాం నాయక్ పేర్లను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం రెండు పార్లమెంట్ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. నాలుగు రోజుల కితం బిఆర్‌ఎస్ వీడిన బిజెపిలో చేరిన ము గ్గురు నేతలకు టికెటు లభించింది.
రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు మొదటి జాబితాలో 9 మంది పేర్లను ప్రకటించగా, రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ప్రకటించింది. రెండు స్థానాలకు మాత్రమే అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఇప్పటివరకు 15 మంది అభ్యర్థులను ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News