Friday, November 22, 2024

మాజీ ఎంఎల్ఎ ముఖ్తార్ అన్సారీకి యావజ్జీవ ఖైదు

- Advertisement -
- Advertisement -

ఫోర్జరీ పత్రాలతో 1990లో ఆయుధాల లైసెన్సు పొందిన కేసులో రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి వారణాసి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. విచారణ పూర్తయిన అనంతరం తీర్పును మంగళవారం రిజర్వ్ చేసిన ప్రత్యేక ఎంపి-ఎమ్మెల్యే కోర్టు బుధవారం శిక్ష పరిమాణాన్ని ప్రకటించింది. ఐపిసిలోని వివిధ సెక్షన్లు, ఆయుధాల చట్టంలోని 30 సెక్షన్ కింద మాఫియా డాన్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది. బందా జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టు విచారణలో అన్సారీ పాల్గొన్నాడు. జిల్లా మెజెస్ట్రేట్, జిల్లా ఎస్‌పి సంతకాలను ఫోర్జరీ చేసి అన్సారీ ఆయుధాల లైసెన్సు పొదాడు. 1990లో ఈ మోసాన్ని సిబిఐ బయటపెట్టింది.

ముఖ్తార్‌తోసహా ఐదుగురు వ్యక్తులపై ఘాజీపూర్‌లోని మొహాదాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పంజాబ్ జైలులో నుంచి ఉత్తర్ ప్రదేశ్ జైలుకు తీసుకువచ్చిన ముఖ్తార్‌ను 2021 నుంచి బందా జైలులో ఖైదీగా ఉంచారు. 1997లో ఒక బొగ్గు వ్యాపారిని చంపివేస్తామని బెదిరించిన కేసులో ముఖ్తార్‌కు గత ఏడాది డిసెంబర్‌లో ఐదున్నరేళ్ల కారాగార శిక్ష పడింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్తార్ అన్సారీ ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. 2022 అసెంబ్లీ ఎన్నికలలో అతను పోటీ చేయలేదు. అయితే ఆ సీటులో అతని కుమారుడు అబ్బాస్ అన్సారీ సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News