Saturday, December 21, 2024

పోరాడుతున్న విదర్భ..

- Advertisement -
- Advertisement -

ముంబై రంజీ ఫైనల్
ముంబై: రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ జట్టు పోరాడుతోంది. 538 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన విదర్భ బుధవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే గురువారం చివరి రోజు విదర్భ మరో 290 పరుగులు చేయాలి. ముంబై రంజీ ఛాంపియన్‌గా నిలవాలంటే మరో ఐదు వికెట్లను పడగొట్టాలి. పరిస్థితులు మాత్రం ముంబైకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఏదైన అద్భుతం జరిగితే తప్ప ముంబై మరోసారి రంజీ ఛాంపియన్‌గా నిలవడం ఖాయమనే చెప్పాలి. 10/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం బ్యాటింగ్ చేపట్టిన విదర్భకు ఓపెనర్లు అథర్వ తైడే, ధ్రువ్ షోరె అండగా నిలిచారు. వీ

రిద్దరూ ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అథర్వ (32), షోరె (28) పరుగులు చేసి ఔటయ్యారు. తర్వాత వచ్చిన కరుణ్ నాయర్, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ కుదురుగా ఆడడంతో విదర్భ కోలుకుంది. అమన్ (32)తో కలిసి కరుణ్ నాయర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన నాయర్ 220 బంతుల్లో 3 ఫోర్లతో 74 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన అక్షయ్ 91 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి హర్ష్ దూబే (11) నాటౌట్ అండగా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News