Monday, December 23, 2024

కెసిఆర్ అన్న కుమారుడిపై భూకబ్జా కేసు నమోదు…

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె చంద్రశేఖర్ రావు అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆధిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఎకరాల భూమిని కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారాకు కబ్జా చేశారని ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38 మంది బిఆర్‌ఎస్ నాయకులతో పాటు కన్నారావుపై ఐపిసి 307, 447, 427, 436, 148, 149 వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కన్నారావుతో పాటు 35 మంది పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కెసిఆర్ అన్న కుమారుడు కన్నారావు బెంగళూరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఒఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూమిలో కన్నారావు అనుచరులు ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News