Friday, December 20, 2024

జితేందర్ రెడ్డిని కలిసిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

పార్టీ టికెట్ ఆశించి భంగపడిన బిజేపి నేత జితేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది. రేవంత్ తన సహచర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి గురువారం మధ్యాహ్నం జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి, ఆయనతో కాసేపు చర్చలు జరిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో జితేందర్ మహబూబ్ నగర్ టికెట్ ఆశించారు. అయితే బిజేపి అధిష్ఠానం డికె అరుణవైపు మొగ్గు చూపింది. దీంతో జితేందర్ అసంతృప్తికి లోనైన జితేందర్ ను ముఖ్యమంత్రి రేవంత్ కలిసి, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు నడుం బిగించిన రేవంత్.. జితేందర్ చేరిక వల్ల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సునాయాసమవుతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంనుంచి కాంగ్రెస్ టికెట్ పై వంశీచంద్ రెడ్డి పోటీ చేస్తారని రేవంత్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News