- Advertisement -
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ తో రాజ్యాంగపర సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు దేశ సమాఖ్య స్పూర్తికి చరమగీతం అవుతుందన్నారు. జమిలి విధానం దేశాన్ని ఏక పార్టీ దేశంగా మారుస్తుందన్నారు ఎంపి అసదుద్దీన్. తరుచూ ఎన్నికలుంటే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయన్న ఆయన ఇప్పటికే ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వాలు ఐదేళ్లు పట్టించుకోవట్లేదని తెలిపారు. ప్రజలు గురించి పార్టీలు ఆందోళన చెందే అవసరం లేకపోవడం సరికాదని అసదుద్దీన్ తెలిపారు.
- Advertisement -