- Advertisement -
బెంగళూరులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిశానని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో డికె శివకుమార్ కలిశానన్నారు. శివకుమార్ ను కలవడంతో ఎలాంటి రాజకీయం లేదని వివరణ ఇచ్చారు. పార్టీ మారడం లేదు, బిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని ఖచ్చితంగా చెప్పారు. వేరే పార్టీల నుండి నా కుటుంబ సభ్యులు పోటీ చెయ్యరన్నారు. డీకే శివకుమార్ తన మిత్రుడని చెప్పారు. వ్యాపార విషయంలో రెండు రోజుల క్రితం డీకేను కలిశానని బీఆర్ఎస్ మల్లారెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -