Tuesday, December 24, 2024

రాజ్యాంగాన్ని నాశనం చేయడమే వారి ఉద్దేశం:కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.‘ ఒక దేశం ఒకే ఎన్నిక పేరుతో రాజ్యాంగాన్ని పూర్తిగా కూల్చివేయాలని ప్రభుత్వం అనుకుంటోందని మండిపడింది. ఈ పరిణామంపై నాసిక్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను పిటిఐ ప్రశ్నించగా ‘ప్రధానమంత్రి ఉద్దేశం చాలా సుస్పష్టంగా ఉంది.

మూడింట రెండు వంతుల మెజారిటీ 400 సీట్లు ఇవ్వాలని కోరుతూ ఆయన దేశమంతా పర్యటిస్తున్నారు. దాని వెనుక ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసు. ‘ ఒక దేశం ఒకే ఎన్నిక’ లక్షంతో బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలనేదే వారి ఉద్దేశం’ అని ఆయన అన్నారు. కాగా ఇది రాజకీయ అంశం కాదని బిజెపి అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి అంటూ, డబ్బుతో పాటు ఇతర వనరులను ఆదా చేయడమే జమిలి ఎన్నికల ముఖ్య ఉద్దేశమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News