దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15,16వ తేదీల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.శుక్రవారం సాయంత్రం 4.40 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మల్కాజ్‌గిరి వరకు రోడ్ షో నిర్వహించనున్నారు.
తర్వాత అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. ఈ సమయంలో వాహనాలను ఆపివేయడం లేదా డైవర్ట్ చేస్తారు. బేగంపేట, పిఎన్‌టి జంక్షన్, రసూల్‌పుర, సిటిఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే ఆస్పత్రి, మెట్టుగూడ రోటరీ, మిర్జాల్‌గూడ టి జంక్షన్, మల్కాజ్‌గిరి ఆర్చ్, లాలాపేట, తార్నాక, గ్రీన్స్‌ల్యాండ్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్ ఎంఎంటిఎస్, వివి స్టాట్యూ.
16వ తేదీన….
16వ తేదీ ఉదయం 10.40 గంటల నుంచి 11.15 గంటల వరకు ప్రధాని బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. ఈ సమయంలో వివి స్టాట్యూ, మెట్రో రెసిడెన్సీ లేన్, ఎంఎంటిఎస్ రాజ్‌భవన్, పంజాగుట్ట, గ్రీన్స్‌ల్యాండ్, హెచ్‌పిఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పిఎన్‌టి ఫ్లైఓవర్‌లో ట్రాఫిక్ ఆపివేయనున్నారు.