Sunday, January 19, 2025

కర్నాటక డిప్యూటీ సిఎంతో మల్లారెడ్డి భేటీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం..
ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన మల్లా రెడ్డి కుటుంబసభ్యులు
మనతెలంగాణ/హైదరాబాద్: కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌తో బిఆర్‌ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఆయనతో పాటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డికె శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అడిగినట్టుగా తెలిసింది. కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు రాష్ట్ర నేతలు సిఎం రేవంత్ రెడ్డి, మైనంపల్లి వంటి నేతలంతా నిరాకరిస్తుండగా డికె శివకుమార్ ద్వారా మల్లారెడ్డి పైరవీలు చేస్తున్నారంటూ వార్తలు వెలువడడంతో ఈ వార్తకు ప్రాధాన్యత చేకూరింది. ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని మల్లారెడ్డి కలిసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తు తం డికెతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను: మల్లారెడ్డి
తాజాగా డికెతో భేటీపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన వెల్లడించారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమం లో డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌ను కలిసినట్లు ఆయన తెలిపారు. తాను బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News