బెంగళూరు: బిజెపి సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో లోక్ సభ ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 17 ఏళ్ల బాలికపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు రావడంతో యడియూరప్పపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తనని మోసం చేశారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. యడియూరప్ప తన కూతురును గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. నెల రోజుల తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు ఆయనపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలపై ఇప్పటివరకు యడియూరప్ప కానీ, ఆయన కుటుంబ సభ్యులు స్పందించలేదు. ఆయన కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. ఆ కుటుంబం ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను ఆయన కార్యాలయం పేర్కొంది. గతంలో పలువరిపై ఆరోపణలు చేశారని వివరించింది. కర్నాటక రాష్ట్రానికి ఆయన నాలుగు సార్లు సిఎంగా సేవలందించారు. బిజెపి అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉన్నారు. బిజెపి అధిష్ఠానం ఆయన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించి ఆయన కుమారుడికి అప్పగించారు. ప్రస్తుతం ఆయన బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు.
యడియూరప్పపై లైంగిక ఆరోపణలు… పోక్సో కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -