Friday, December 20, 2024

ఎన్నికల బాండ్లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

ఎన్నికల బాండ్ల పథకం ద్వారా అవినీతికి పాల్పడిన బిజెపిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి ఆ పారీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా 50 శాతానికి పైగా విరాళాలను బిజెపి పొందిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడితో బిజెపి అవినీతి కార్యకలాపాలు బహిర్గతమయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆరోపించారు. బిజెపి క్విడ్ ప్రో కోకు పాల్పడిందని, విరాళాలు ఇచ్చిన కంపెనీలకు రక్షణ కల్పించడం, డొల్ల కంపెనీల నుంచి ముడుపులను మనీ లాండరింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. న ఖావూంగా..న ఖిలావూంగా(నేను తినను ఇతరులను తిననివ్వను) అంటూ ప్రధాని మోడీ చెబుతుంటారని, అయితే ఆయన చేసేది చూస్తుంటే సిర్ఖ్ బిజెపి కో ఖిలావూంగా(బిజెపికి మాత్రమే తినిపిస్తాను) అన్నట్లు కనపడుదోందని ఖర్గే వ్యంగ్య బాణాలు రువ్వారు.

ఎస్‌బిఐ విడుదల చేసిన ఎన్నికల బాండ్ల వివరాల ప్రకారం 50 శాతం బాండ్లు బిజెపికి అందాయని, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మాత్రం 11 శాతమే అందాయని ఆయన తెలిపారు. బాఉండ్లను కొనుగోలు చేసిన కంపెనీలలో అనేకం డొల్ల కంపెనీలు ఉన్నాయని, వీరంతా ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇడి, ఐటి, సిబిఐ దాడుల తర్వాత అనేక కంపెనీలు బిజెపికి విరాళాలు అందచేశాయని, వాటి మీద ఎవరు ఒత్తిడి తీసుకువచ్చారని ఖర్గే ప్రశ్నించారు. బిజెపి అవినీతి బండారాన్ని బయటపెట్టేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరుతున్నామని ఆయన తెలిపారు. ఐటి శౠఖ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారని, కాని వందల కోట్లలో అవినీతికి పాల్పడిన బిజెపిపై ఎటువంటి చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఖర్గే తెలిపారు. ఇలా ఉండగా.. కంపెనీలపై జరిగిన ఇడి, సిఐబి, ఐటి దాడులకు, ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు పొందడానికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కేవలం

ఊహాజనితమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత మొత్తంలో విరాళమిచ్చారో పూర్తి వివరాలను ఆమె వెల్లడించాలని ఆయన డిమాండు చేశారు. బాండ్ ఐడి నంబర్లను కూడా బయటపెట్టాలని, దీని ద్వారా దాతలను, గ్రహీతలను జత చేయవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల బాండ్లను విరాళంగా అందచేసిన వెంటనే ప్రభుత్వం నుంచి భారీ ప్రయోజనాలు పొందిన కంపెనీలు చాలా ఉన్నాయని రమేష్ చెప్పారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ ఎన్నికల బాండ్ల రూపంలో రూ. 800 కోట్ల విరాళాలు అందచేసిందని ఆయన తెలిపారు. 2023 ఏప్రిల్‌లో ఆ కంపెనీ రూ. 140 కోట్లు విరాళంగా ఇచ్చిందని, నెల రోజుల తర్వాత ఆ కంపెనీకి రూ. 14,400 కోట్ల థాణె-బోరివలి టివన్ టన్నెల్ ప్రాజెక్టు కాంటాక్టు దక్కిందని ఆయన ఆరోపించారు. 2022 అక్టోబర్ 7న జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థ

రూ. 25 కోట్లు బాండ్ల ద్వారా విరాళం ఇవ్వగా కేవలం మూడు రోజుల తర్వాత అక్టోబర్ 10న గారె పాల్మా ఉవి/6 బొగ్గు గని కాంట్రాక్టు దక్కిందని ఆయన ఆరోపించారు. బిజెపి హఫ్తా వసూల్ ఎత్తుగడ చాలా సులభమైనదని, ఇడి, సిబిఐ, ఐటి ద్వారా ఒక కంపెనీపై దాడి చేయించి హఫ్తా(విరాళాలు) గురించి మాట్లాడుకుని ఆ కంపెనీకి రక్షణ కల్పించడమని ఆయన చెప్పారు. బిజెపికి విరాళాలు ఇచ్చిన 30 కంపెనీలలో కనీసం 14 కంపెనీలపై అటువంటి దాడులు జరిగాయని జైరాం రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News