Saturday, November 23, 2024

రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ అరెస్టులతో కాదు : పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను ఇడి కుట్రపూరితంగా అరెస్ట్ చేయడాన్ని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. కెసిఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధమ్ము లేక, వారి కుటుంబ సభ్యులైన మహిళలపై భారత చట్టాలకు విరుద్ధంగా సాయంత్రం 6:00 గంటల తర్వాత సుప్రీం కోర్టులో ఇచ్చిన మాటకు విరుద్ధంగా రెండు రోజులు శనివారం, ఆదివారం సెలవులు చూసి అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. రాజకీయ కక్ష తీర్చుకొనుటకు ఈవిధంగా కక్షపూరితమైన చర్యలను తెలంగాణ ప్రజానీకం నిరసిస్తుందని అన్నారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ అరెస్టులతో కాదు అని పేర్కొన్నారు. అక్రమ కేసులతో ఎదుర్కోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసిన చర్యగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కుట్రపూరితమైన అరెస్టులను తెలంగాణ ప్రజలు ఖండించి ఈ సమయంలో కెసిఆర్‌కు, బిఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలవాలని పేర్కొన్నారు. అదే విధంగా అక్రమంగా అరెస్టయిన కల్వకుంట్ల కవితను వెంటనే విడుదల చేయాలని కోరారు.
కవిత అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కుట్రే : అనిల్ కూర్మాచలం
బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అరెస్టు ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగమేనని ఎఫ్‌డిసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. ఈ కేసు విచారణ సుప్రీం కోర్టులో ఉండగా ఒక మహిళ హక్కులను కాలరాసి రాత్రిపూట అరెస్టు చేయడం కేంద్రంలోని బిజెపి చేసే కుట్ర రాజకీయాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్న ప్రచారానికి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వెళ్లే ముందు వారి ఆధీనంలో ఉన్న ఇడి, సిబిఐలు అక్కడ ప్రత్యేక్షమవుతాయని ఆరోపించారు. ఈరోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టేముందు మోదీ ఈ దారుణానికి పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చీకటి రోజు అని పేర్కొన్నారు. కడిగిన ముత్యంలా ఎంఎల్‌సి కవిత బయటకు వస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యం గెలుస్తుందని అనిల్ కూర్మాచలం ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News