Friday, December 20, 2024

నాగర్‌కర్నూల్‌ బిజెపి విజయసంకల్ప సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు పర్యటన కొనసాగనుంది. శనివారం ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బేగంపేట విమానశ్రయానికి ప్రధాని వెళ్లనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ కు వెళ్లనున్నారు ప్రధాని. మధ్యాహ్నం 12 నుంచి 12.45 వరకు నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభ మోడీ పాల్గొనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నాటక వెళ్లనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని తెలంగాణలో పర్యటిస్తున్నారు.  శుక్రవారం మల్కాజ్ గిరిలో ప్రధాని రోడ్ షో పాల్గొన్న విషయం తెలిసిందే. మళ్లీ ఈ నెల 18న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News