Tuesday, December 24, 2024

ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోంది: ఇసి

- Advertisement -
- Advertisement -

దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వైపు ప్రపంచమంతా చూస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమావేశం నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా సిఇసి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని… భారత ప్రజస్వామ్యబద్ధమైన ఎన్నికలను ప్రపంచం గమనిస్తుందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యామైన భారత్ లో ఎన్నికలకు సౌకర్యాలు కల్పించడం పెద్ద సవాల్ వంటిదన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొనాలని ఆయన కోరారు.

ఎన్నికలకు 55 లక్షల ఇవిఎంలను సిద్ధం చేశామని చెప్పారు. కాశ్మీర్ కు కూడా నిర్వహించాల్సి ఉందన్నారు. ఈసారి దేశంలో మొత్తం 97కోట్లమంది ఓటర్లు ఉన్నారని.. ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియపై సమీక్షించామన్నారు. ఎలాంటి పొరబాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలనేదే మా లక్ష్యమని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఈసారి ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News