Monday, December 23, 2024

12 రాష్ట్రాల్లో పురుషుల కంటే.. మహిళా ఓటర్లే ఎక్కువ: ఇసి

- Advertisement -
- Advertisement -

ప్రతి ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని.. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని వందశాతం అడ్డుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల జరగనున్న నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ పై, బ్యాంకు లావాదేవీలపై కూడా నిఘా ఉంచుతామని..టివి, సోషల్ మీడియా ప్రచారంపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పింది.

శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ పై మీడియా సమావేశం నిర్వహించింది ఇసి. ఈ సందర్భంగా సిఇసి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. “దేశంలో మొత్తం 10.5లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 85 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వినియోగించుకోవచ్చు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. దేశంలో మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1కోట్లు ఉన్నారు. 48వేలమంది ట్రాన్స్ జెండర్లు, 88.4లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలను కేవైసి యాప్ లో చూసుకోవచ్చు. 1.85కోట్ల మంది యువతి తొలిసారి ఓటు వేయనున్నారు” అని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News