Monday, December 23, 2024

ఎంఎల్ సి కవిత అరెస్ట్‌పై భగ్గుమన్న బిఆర్‌ఎస్ శ్రేణులు

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్సీ కవితను ఈ డి అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసనగా బిఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మాజి ఎమ్మెల్యే గంపగోవరదన్ ఆద్వర్యంలో ధర్నా కార్యకర్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నిజాంసాగర్ చౌరస్తా వద్దకు బిఆర్‌ఎస్ నాయకు లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేశారు.ఈడి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ప్రా ంతం మార్మోగించారు.

కవితను బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిజేపి పార్టీ కక్ష సాధింపు చర్యతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల సమయంలో ఒక పథకం ప్రకారం కాంగ్రేస్ బిజేపి కుమ్ముక్కై కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. తమ నాయకురాలిని విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News