Monday, January 20, 2025

జెకె గ్రూపులపై మోడీ ప్రభుత్వం వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నిర్బంధంలో ఉన్న ఉగ్ర నిందితుడు యాసిక్ మాలిక్ సారథ్యంలోని జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(జెకెఎల్‌ఎఫ్), జమ్మూ కశ్మీరు పీపుల్స్ ఫ్రీడం లీగ్, జమ్మూ కశ్మీరు పీపుల్స్ లీగ్‌కు చెందిన నాలుగు గ్రూపులను ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంతోపాటు వేర్పాలువాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిషేధించింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ఈ నిర్ణయాలను ప్రకటిస్తూ దేశ భద్రతను, సార్వభౌమత్వాన్ని, సమగ్రతను సవాలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జమ్ము కశ్మీరు పీపుల్స్ లీగ్‌కు చెందిన జెకెపిఎల్(ముఖ్తార్ అహ్మద్ వాజా), జెకెపిఎల్(బషీర్ అహ్మద్ తోతా), జెకెపిఎల్(గులాం మొహమ్మద్ ఖాన్), జెకెపిఎల్(అజీజ్ షేక్) వర్గాలను నిషేధిస్తూ కేంద్ర హోం వ్యవహారాల శాఖ విడిఆ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

జమ్మూ కశ్మీరు లిబరేషన్ ఫ్రంట్(మొహమ్మద్ యాసిన్ మాలిక్ వర్గం)ను చట్టవ్యతిరేక సంఘంగా మరో దేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జమ్మూ కశ్మీరులో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్లూ, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశ సమైక్యతకు ముప్పు తెస్తున్న జమ్మూ కశ్మీరు పీపుల్స్ ఫ్రీడం లీగ్‌ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలలో భాగస్వాములయ్యే వ్యక్తులు, సంస్థలను మోడీ ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News