ఈ నెల 18 నుంచి ఎప్రిల్ 02వ తేది వరకు జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సిద్దిపేట్ జిల్లాలో వున్న (80) పరీక్ష కేంద్రాల వద్ద 144 అమలులో ఉంటుందని సీపీ అనురాద అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరకు ఉదయం ఆరుగం టల నుండి సాయంత్రంఆరు గంటల వరనకు మల్లో ఉంటుందని తెలిపారు. పరీక్షలు జరుగు సమయంలో సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసి వేయాలన్నారు. పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ఐదుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ ప్రజలు గుమిగూడ వద్దన్నారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలీసు అధికారులు ,సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ అధికారులు పరీక్షల సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు, పోలీస్ స్టేషన్ నుండి పరిక్ష పత్రం పరిక్ష కేంద్రానికి వెళ్ళే సమయంలో కానిస్టేబుల్ తప్పనిసరిగా ఎస్కార్ట్ వుండాలన్నారు, పరిక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలను ఆదేశించారు .విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షా సమయానికే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు.