మనం ఎక్కవగా పర్యావరణ కాలుష్యం గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇటీవల ఆహార కాలుష్యం కూడా పర్యావరణ కాలుష్యం లో భాగమైంది. ఆహార కాలుష్యం తేలికపాటి నుండి తీవ్రమైన ఆహార అనారోగ్యాలకు కారణమవుతుంది లేదా అధ్వాన్నంగా, హార్మోన్లు, జీవక్రియ సమస్యలు లేదా వివిధ రకాల క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను దోహదం చేస్తుంది. పురుగుమందులతో కలుషితమైన ఆహారం వల్ల నాడీ వ్యవస్థ సమస్యలు వస్తున్నాయి. అరుదైన సందర్భాల్లో అత్యంత కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు మరణం సంభవించవచ్చు. ఆహార కాలుష్యం చిన్న అసౌకర్యం నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు దేనినైనా దారి తీస్తుంది.రోజూ రోజుకు పంటలు మరియు కూరగాయల పెంపకంలో రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కువైంది.అదే విధంగా ప్రజలకు కూడా బయట లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం అనివార్యం అయింది.దీని వల్ల ప్రజలు త్వరగా అనారోగ్యానికి గురౌతున్నారు.
ఇటీవల తమిళనాడులో పీచు మిఠాయి తయారీలో వాటికి రంగు రావడం కోసం రోడమైన్-బి అనే కెమికల్ ఉపయోగిస్తున్నారని తేలింది. . ఇది క్యాన్సర్ కారకంగా ఇటీవల కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. దాంతో తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని తమిళనాడు అక్కడి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సైతం తనిఖీలు చేపట్టి.. పీచు మిఠాయి నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించారు. ఈ కాటన్ క్యాండీల తయారీలో రోడమైన్-బి అనే కెమికల్ ఉన్నట్లు తేలింది. దీంతో సీరియస్ అయిన ప్రభుత్వం పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. అంతేకాదు. తినడం కూడా నేరంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది.క్యాడ్‌బరీ చాక్లేట్లు తినేందుకు అంత సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ (ఎస్‌ఎఫ్‌ఎల్) స్పష్టం చేసింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి.. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ కొని తిందామనుకున్న సమయంలో ఆ చాక్లెట్లో ఓ పురుగు సజీవంగా కనిపించింది. దీంతో అతడు అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 ప్రకారం క్యాడ్‌బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్స్ చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి సురక్షితంగా కాదని నిర్ధారించిందారు. క్యాడ్ బరీ చాక్లెట్లు తినకూడదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
వేసవిలో శీతల పానీయాలకు,మామిడి పండ్లకు డిమాండ్ ఉంటుంది. వివిధ రకాల పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్ వంటి పలు రకాల రసాయనాలను వాడుతున్నారు.శీతల పానీయాలు లేదా సోడాలలో చక్కెర వంటి ఫాస్పోరిక్ ఆమ్లం, సేంద్రీయ ఆమ్లాలుంటాయి. ఇవి దంతాలపై రక్షణ కవచంగా ఉండే ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా దంతాలు పెళుసుగా మారడం లేదా పుచ్చిపోవడం జరుగుతుంది. పెళుసుగా ఉండే దంతాలు త్వరగా ఊడిపోతాయి.
తక్కువ కలుషిత ఆహార ఉత్పత్తిని నిర్ధారించే ప్రత్యామ్నాయం ఇటీవల జపాన్‌లో పర్యావరణ కాలుష్యం, అనూహ్య వాతావరణం లేదా తెగుళ్ళ యొక్క అనూహ్య ప్రభావాన్ని తొలగించే విధంగా ముందుకు వచ్చింది. ఫ్యాక్టరీలలో కూరగాయలను పండించాలని సూచనలు వచ్చాయి.
ఈ ప్రక్రియ అంతా కంప్యూటరైజ్ చేయబడి, వృద్ధిని ప్రభావితం చేసే వివిధ అంశాలను నియంత్రిస్తుంది. ఈ సురక్షితమైన ఆహార ప్రత్యామ్నాయాన్ని టోక్యోలోని ఓజు కార్పొరేషన్ ప్రతిపాదించింది. ఇది వ్యవసాయ భవిష్యత్తును నిర్దేశిస్తుందా? కాలమే చెబుతుంది.ఆ హార కాలుష్యం ప్రమాదాలు ప్రతిచోటా ఉన్నాయి. మనం చేయగలిగినదల్లా కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండడమే. ప్రభుత్వాలు కూడా మార్కెట్లో అమ్మే వివిధ రకాల ఆహార పదార్థాలపై సరైన పర్యవేక్షణ చేయాలి. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించే విధంగా చూడాలి.సహజ సిద్ధమైన పద్దతులతో కూరగాయలని పెంచేందుకు తగిన వాతావరణాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అప్పుడే కొంత వరకు ఆహార కాలుష్యాన్ని నియంత్రణ చేయవచ్చు.
-యం. రాం ప్రదీప్
9492712836