కరీంనగర్ ప్రతిమ మల్టీఫ్లెక్స్‌లో స్వాధీనం
ఐటి అధికారులకు అప్పగించిన పోలీసులు
మన తెలంగాణ/ కరీంనగర్ క్రైం: కరీంనగర్ నగర నడిబొడ్డున బస్టాండ్‌కు దగ్గరగా ఉన్న ప్రతిమ మల్టీప్లె క్స్‌లో పోలీసులు రూ.6.67 కోట్ల పైచిలుకు నగదును పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో అన్ అకౌంటబుల్ నగదు ఉన్నదనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం అర్ధరాత్రి టౌ న్ ఎసిపి నరేందర్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎసిపిలు, ముగ్గురు ఇన్స్‌పెక్టర్లు, ఐదుగురు సబ్ ఇన్స్‌పెక్టర్లు, ఇతర సిబ్బంది దాదాపు 30 మంది పోలీసులు మెరుపు దాడి చేసి తనిఖీలు చేపట్టారు.
దాదాపు 8 గంటల శ్రమించి హోటల్‌లోని అన్నిచోట్లా తనిఖీలు నిర్వహించారు. సెల్లార్‌లో గల అకౌంట్స్ ఆఫీస్ రూమ్‌లో 6 కోట్ల 67 లక్షల 32 వేల 50 రూ పాయలు నగదును గుర్తించినట్లు కరీంనగర్ టౌన్ ఎసిపి నరేందర్ తెలి పారు. ఈ నగదుకు సంబంధించి ప్రతిమ హోటల్‌కు చెందిన జనరల్ మేనేజర్ పి రాఘవేంద్రబాబును వివరణ కోరగా సరైన సమాధానం చెప్పనందున, పట్టుబడిన నగదును పంచుల సమక్షంలో వీడియో చిత్రీకరణలో పంచనామా నిర్వహించి తదుపరి ప్రక్రియ కోసం ఐటి అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. నగదును ఐటి అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.