Saturday, November 23, 2024

ధరణి స్పెషల్ డ్రైవ్‌కు బ్రేక్

- Advertisement -
- Advertisement -

ఇ డ్రైవ్‌ను ఆపాలని ప్రభుత్వం ఆదేశం

ఎన్నికల పూర్తి అయ్యేవరకు నిలిపివేత
ఎన్నికల విధులకు సిబ్బంది

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి స్పెషల్ డ్రైవ్‌కు ఎన్నికల బ్రేక్ పడిం ది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు ఈ డ్రైవ్‌ను ఆపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని జి ల్లాల కలెక్టర్‌లకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఈ స్పెషల్‌డ్రైవ్‌ను ఆ పాలని ఆయన ఆదేశాలిచ్చారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న రైతుల భూమి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టింది. ఈ మేరకు ధరణిపై ఏర్పాటైన అద్యయన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ధరణి సమస్య ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పడుతుందని, ఈ లోగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరింది. ధరణి కమి టీ చేసిన ఈ సూచనకు స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూశాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధికారులతో సమావేశమై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 2024 మార్చి 2వ తేదీ నుం చి 9వ తేదీ వరకు మొదట స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ప్రతి మండలానికి మూ డు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News