Friday, November 22, 2024

అదే అశ్విన్ ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది: ద్రావిడ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: స్పిన్నర్లకు అనుభవం వస్తున్న కొలదీ పరిణతి చెందుతారని టీమిండియా మాజీ ఆటగాడు, కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. టెస్టుల్లో రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్లు తీసుకున్న సందర్బంగా తమిళనాడు క్రికెట్ సంఘం అతడిని సన్మానించింది. ఈ సందర్భంగా రవి శాస్త్రి మాట్లాడారు. అశ్విన్ ఇంకా రెండు మూడేళ్లు బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టే అవకాశం ఉందని తెలియజేశారు. అశ్విన్ ఇంకా రెండు మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే సత్తా ఉందన్నారు. టెస్టు క్రికెట్‌లో ఐదు వందల వికెట్లు తీయడం చిన్న విషయం కాదని, అతడిలో ఇంకా టాలెంట్ ఉందని శాస్త్రి స్పష్టం చేశారు.

రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్‌లో ఉన్న శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో అతడు ఉన్నతస్థాయికి వెళ్లాడని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రశంసించారు. ఒక తరం స్పిన్నర్లు అతడు స్ఫూర్తిగా నిలుస్తాడని, అశ్విన్‌తో కలిసి పని చేయడం ఎంతో అస్వాదిస్తానని స్పష్టం చేశారు.

కెరీర్ ప్రారంభంలో మహేంద్ర సింగ్ ధోనీ తన మద్దతు ఇచ్చాడని అశ్విన్ గుర్తు చేశాడు. ధోనీ తనకు ఇచ్చిన దానికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 17 ఏళ్ల క్రితం వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ గేల్ ఎదురుగా ఉంటే అతడు తనకు బౌలింగ్ అవకాశం ఇచ్చాడని అశ్విన్ ప్రశంసించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News