Monday, December 23, 2024

‘బిచ్చగాడు’ తర్వాత గుర్తుండిపోయే ‘లవ్ గురు’

- Advertisement -
- Advertisement -

వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా ‘లవ్ గురు‘. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో విజయ్ ఆం టోనీ మాట్లాడుతూ “దాదాపు 95 శాతం మందికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.

ముఖ్యంగా అబ్బాయిలకు అమ్మాయిలను హ్యాండిల్ చేయడం అనేది పెద్ద సమస్య. ఈ ‘లవ్ గురు‘ సినిమా చూస్తే అమ్మాయిలను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. నేనే లవ్ గురుగా ఆ పరిష్కారాలు చెబుతాను. ఈ సినిమాలో లీలా అనే అమ్మాయితో నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాను. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాను అనేది ఫన్నీగా దర్శకుడు వినాయక్ ఈ సినిమాలో చూపించాడు”అని అన్నారు.

డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ “బిచ్చగాడు సినిమా తర్వాత అంతలా ‘లవ్ గురు‘ సినిమా కూడా ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ఈ సినిమా విజయ్ ఆంటోనీకి 2.0 అనుకోవచ్చు”అని తెలిపారు. హీరోయిన్ మృణాలిని రవి మాట్లాడుతూ “లవ్ గురు‘ సినిమాలో లీలా అనే క్యారెక్టర్‌లో మీ ముందుకు వస్తున్నాను. విజయ్ ఆంటోనీని ఇప్పటిదాకా సీరియస్ క్యారెక్టర్స్ లో చూశారు. కానీ ఈ సినిమాలో రొమాంటిక్‌గా చూస్తారు. అది స్క్రీన్ మీద చాలా కొత్తగా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాటలు, మాటల రచయిత భాష్యశ్రీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News