Thursday, December 26, 2024

అప్పుడు నిజాం…ఇప్పుడు కెసిఆర్ పాలన అంతమైంది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను బిఆర్‌ఎస్ అధినేతన కెసిఆర్ నాశనం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నియంత ఎప్పుడూ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూస్తాడని చురకలంటించారు. మీట్ ది మీడియా కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అలాగే 2023 డిసెంబర్ 3కు చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉందని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం రాచరిక పాలన అంతమైందని, 2023 డిసెంబర్ 3న కెసిఆర్ పాలన అంతమైందని చురకలంటించారు. మా వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారని, అభివృద్ధి చేశాను కాబట్టి తానే అధికారంలో ఉండాలని నిజాం కోరుకున్నారని, నిజాంలాగే కెసిఆర్ కూడా రాచరికాన్ని తేవాలని చూశారని ఎద్దేవా చేశారు. వారసుడిని సిఎం చేయాలని కెసిఆర్ అనుకున్నారని, వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమై తీర్పు ఇచ్చారన్నారు.

కెసిఆర్ కుటుంబాన్ని అధికారం ప్రజలు దించారని, నిజాం నకలునే కెసిఆర్ చూపించారని, ప్రజాస్వామ్యంపై కెసిఆర్‌కు నమ్మకం లేదని, ఏనాడూ ప్రజల స్వేచ్ఛను కెసిఆర్ గౌరవించలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు పూర్తి చేసుకున్నామని, ధర్నా చౌక్‌లో నిరసనలకు అనుమతులు ఇచ్చామని, తెలంగాణ వాహన రిజిస్టేషన్‌లో టిజి బదులు టిఎస్ తీసుకొచ్చారని, టిఆర్‌ఎస్ నకలుగానే టిఎస్ అనేది తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జయ జయహే తెలంగాణ పాటను కెసిఆర్ రాష్ట్రగీతంగా ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తరువాత కవులు, కళాకారులు గడిల్లో దాక్కొవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News