Friday, December 20, 2024

బిఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ లో చేరిన దానం, రంజిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ముందు బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బిఆర్‌ఎస్ చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, బిఆర్‌ఎస్ ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టిపిసిసి ప్రెసిడెంట్, సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం ఆ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ ఎంపి రంజిత్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. దీంతో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కలవరానికి గురవుతున్నారు. జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్ బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వర్థన్నపేట మాజీ ఎంఎల్‌ఎ ఆరూరి రమేశ్ బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు, ఇంకా కొంత మంది ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News