Saturday, December 21, 2024

దారుణ హత్య: తుపాకీతో కాల్చి.. కత్తిలతో పొడిచి చంపేశారు

- Advertisement -
- Advertisement -

ఓ వ్యక్తిపై తుపాకీతో కల్పులు జరిపి.. అనంతరం కత్తులతో కిరాతకంగా పొడిచి హత్య చేశారు. ఈ దారుణ హత్య మహారాష్ట్రలో పూణె జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఇందాపూర్‌ ప్రాంతంలోని ఓ హోటల్ లోకి కొందరు దుండగులు చొరబడి.. టేబుల్ వద్ద కూర్చొని ఉన్న అవినాశ్ ధన్వే అనే వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి.. కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

సిసిటివి ఫుటేజీ ద్వారా ఎనిమిది మంది దుండగులను గుర్తించినట్లు పూణే రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని.. ప్రత్యర్థులే అవినాశ్ ను హత్య చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులను పట్టకునేందుకు టీమ్ లుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News