Friday, December 20, 2024

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడించిన ఇసి.. ఏ పార్టీకి ఎన్ని కోట్లంటే?

- Advertisement -
- Advertisement -

ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఇసి ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏ రాజకీయ పార్టీ ఎంత విరాళం అందిందో తెలిపింది.

ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి సమగ్రమైన వివరాలు అందజేయనందుకు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 18లోగా అన్ని వివరాలూ అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఇవ్వకపోవడం వల్ల ఏ సంస్థ.. ఏ రాజకీయ పార్టీకి ఎన్ని నిధులు ఇచ్చిందో తెలియట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో తాజాగా ఎస్ బిఐ.. బాండ్ల పూర్తి వివరాలను ఇసికి అందించింది.

ఎలక్టోరల్ బాండ్ల పూర్తి వివరాల.. ఏ పార్టీకి ఎన్నికోట్ల విరాళాలు అందాయంటే..

బిజెపి- రూ.6,986.5 కోట్లు
తృణమూల్‌ కాంగ్రెస్‌(టిఎంసి)- రూ.1,397 కోట్లు
కాంగ్రెస్‌ – రూ.1,334 కోట్లు
బిఆర్ఎస్ – రూ.1,322 కోట్లు
బిజెడి – రూ.944 కోట్లు
డీఎంకే – రూ.656.5కోట్లు.
వైసిపి – రూ.442.8 కోట్లు
టిడిపి – రూ.181.35 కోట్లు
సమాజ్‌వాదీ పార్టీ – రూ.14.5 కోట్లు
అకాలీదళ్‌ – రూ.7.26కోట్లు
ఎఐఎడిఎంకె – రూ.6.05కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News