Sunday, January 19, 2025

దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ముంబయి: అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) ‘బాగా గోల చేస్తుంటుంది’ కానీ రాజ్యాంగాన్ని ‘మార్చేందుకు’ తగినంత ధైర్యం ఆ పార్టీకి లేదు అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. అయితే, సత్యం, దేశ ప్రజలు తన పక్షాన ఉన్నట్లు రాహుల్ చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు, కాంగ్రెస్ దానికి చేసిన వక్రీకరణలను, అనవసర చేర్పులను సరిదిద్దేందుకు’ పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ తన పార్టీకి ఉండాలని బిజెపి ఎంపి అనంత్‌కుమార్ హెగ్డే ఇటీవల వ్యాఖ్యానించిన విషయం విదితమే. హెగ్డే వ్యాఖ్యలతో నెలకొన్ని వివాదం సద్దుమణిగేలా చేసేందుకు బిజెపి వెంటనే జోక్యం చేసుకుని అవి ఆయన ‘వ్యక్తిగత అభిప్రాయం’గా పేర్కొన్నది. అంతే కాదు. ఆయన నుంచి వివరణను కూడా పార్టీ కోరింది.

ముంబయిలో మహాత్మా గాంధీ నివాసమైన మణి భవన్ నుంచి ఆగస్ట్ క్రాంతి మైదాన్ వరకు ‘న్యాయ్ సంకల్ప్ పాదయాత్ర’ను రాహుల్ గాంధీ ప్రారంభించిన అనంతరం ఒక హాల్‌లో సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం కోసం భారత్ పోరాటం సమయంలో 1942లో ఆగస్ట్ క్రాంతి మైదాన్ నుంచి క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. ‘బిజెపి నానా హడావిడి చేస్తుంటుంది. కానీ రాజ్యాంగాన్ని మార్చేందుకు తగినంత ధైర్యం ఆ పార్టీకి లేదు. సత్యం, ప్రజల మద్దతు మా వైపు ఉన్నాయి’ అని రాహుల్ చెప్పారు. ప్రస్తుత పోరు రెండు ‘భావనల’ మధ్యే కానీ బిజెపి, కాంగ్రెస్ మధ్య కాదు అని ఆయన అన్నారు. ‘దేశాన్ని కేంద్రీకృతంగా పాలన సాగించవవచ్చునని ఒకరు భావిస్తుంటారు. అందులో ఒకరికి అంతా తెలిసి ఉంటుంది.

అందుకు విరుద్ధంగా అధికార వికేంద్రీకరణ ఉండాలని, ప్రజల వాణి వినిపించాలి మేము భావిస్తుంటాం’ అని రాహుల్ చెప్పారు. ఒక వ్యక్తికి ఐఐటి పట్టా ఉన్నంత మాత్రాన అది ఆ వ్యక్తిని రైతు కన్నా మరింత జ్ఞానవంతుడిని చేయదు’ అని ఆయన అన్నారు. అయితే, బిజెపి ఈ విధంగా పని చేయదని రాహుల్ విమర్శించారు. ‘(ప్రధాని) మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు పరిజ్ఞానం ఒక వ్యక్తికే ఉంటుందని, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతకు ఎటువంటి పరిజ్ఞానం ఉండదని భావన ఉంటుంది’ అని రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News