- Advertisement -
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రవీణ్ కుమార్‌కు టిఎస్‌పిఎస్సీ చైర్మన్ ఆఫర్ ఇచ్చానని.. కానీ, ఆయన దానిని తిరస్కరించారని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్‌ఎస్‌లో చేరనున్నారనే వార్తలపై సిఎం స్పందించారు. ప్రవీణ్ కుమార్ బిఆర్‌ఎస్‌లో చేరతారని తాను అనుకోవడం లేదన్నారు.
ప్రవీణ్ కుమార్ పట్ల తనకు గౌరవం ఉందన్నారు. ప్రవీణ్ కుమార్ సర్వీసులో ఉంటే డిజిపి అయ్యేవారని ఆయన చెప్పారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలన్న తపనతో ప్రవీణ్ కుమార్ ఉన్నారని సిఎం రేవంత్ చెప్పారు. ఇప్పుడు కెసిఆర్‌తో చేరితే దానిపై ఆయనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
- Advertisement -