Monday, December 23, 2024

యూఎస్ సిటెల్ నగరంలో ఘనంగా వంద రోజుల వేడుకలు

- Advertisement -
- Advertisement -

ముఖ్య అతిథిగా హాజరైన సిఎం సోదరుడు జగదీశ్వర్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: యూఎస్ సిటెల్ నగరంలో కాంగ్రెస్ వంద రోజుల పాలన వేడుకులను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని సీటెల్ నగరంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర నేషనల్ సోషల్ మీడియా కోఆర్డిరేటర్, సీటెల్ ఐఓసీ అధ్యక్షుడు రాహుల్ సూర్యోదయ సిటెల్ ఐఓసీ నాయకులు యశ్వంత్ రిషి, సాయి చరణ్‌ల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అనుముల హాజరయ్యారు.

వీరితో పాటు ఐఓసీ నేషనల్ టీం సభ్యులు సందీప్ వంగల, నరేందర్ ఎల్మరెడ్డి, మాధవ నెమలి, శ్రీనివాస్ రామసహాయం, తిరుపతి పోచంపల్లి, రామ రాజు, సుధీర్ రెడ్డి, నర్స, ప్రణయ్ ముత్యాల, అజయ్ గౌడ్, బీవీ రెడ్డి, వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్నారు. ముఖ్య అతిథులు, వరంగల్ ఎమ్మెల్యే కుమార్తె నాయిని రాజేందర్ రెడ్డి కుమార్తె డాక్టర్ గోదా నాయిని పాల్గొన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన బాగుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అమరవీరులు, గద్దరన్నకు నివాళ్లు అర్పించారు. ఎన్‌ఆర్‌ఐల కోసం తాను మధ్యవర్తిగా వ్యవహారించి సమస్యలను ప్రభుత్వానికి చేరవేస్తానని జగదీశ్వర్ రెడ్డి సభాముఖంగా తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News