Sunday, January 19, 2025

నేడు బిఆర్‌ఎస్‌లోకి ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ సమక్షంలో చేరనున్న ఆర్‌ఎస్‌పి
మనతెలంగాణ/హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. తన రాజకీయ భవితవ్యంపై ఆదివారం వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపానని పేర్కొన్నారు. ఆ సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయని, కానీ తన మీద నమ్మకంతో తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ ఎక్స్ వేదికగా ప్రవీణ్‌కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను సోమవారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని వెల్లడించారు. తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని స్పష్టం చేశారు. దయచేసి నిండు మనస్సుతో ఆశ్వీరదించండి…జై భీం..జై తెలంగాణ..జై భారత్ అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News