Monday, December 23, 2024

జగన్‌ను సాగనంపండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్‌ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్‌డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని ప్రధాని నరేం ద్ర మోడీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ, జగన్‌పార్టీలు రెండు వేర్వేరు కాదని, వీటిని ఒకే కుటుం బం నడుపుతోందని విమర్శించారు. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం దేశంలోని ప్రజలందరికీ సేవ అందించడమే లక్ష్యంగా పని చేస్తోందని, ప్రతి పేద గురించి ఆలోచించే ప్రభుత్వమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశ జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చామని, ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. పల్నాడు ప్రాంతంలోని పేదలకు 5 వేల పక్కా ఇళ్లు కేటాయించామని జల్ జీవన్ మిషన్ ద్వారా ఏపీలోని కోటి మందికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు కృ షి చేసినట్లు తెలిపారు.

ఆదివారం పల్నాడు జిల్లా బొప్పూడిలో టిడిపి, బిజెపి, జనసేన ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు ముఖ్య అతిథిగా హాజరైయ్యా రు. ముందుగా తెలుగు ప్రజలందరికీ నమస్కారం మీ అభిమానానికి కృతజ్ఞుడినని అనడంతో సభికులను ఆకట్టుకుంది. ఈసందర్భంగా మాట్లాడుతూ రెండు రోజుల కితం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందని, వెంటనే ఎపికి రావడం సంతోషంగా ఉందని, కోటప్పకొండ దగ్గ ర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లు భావిస్తునన్నారు. ఈ ముగ్గురి ఆశీర్వాదం మనకి లభిం చి మనం అధికారంలోకి రావాలని,దృడమైన నిర్ణయా లు తీసుకునేందుకు దైవబలం ఉండబోతోందన్నారు. ఈ సారి ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయని, ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించుకోవాలని, అభివృద్ధి చెందే భారత్ సాకారం చే సుకుందాం. అభివృద్ధి బాటలో ఏపీని నడిపించుకుం దాం. మీరంతా నడుం బిగించి మెజార్టీ సీట్లు గెలిపించాలని కోరారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ రాష్ట్ర భవిష్యత్తుకు చేసిన కృషి అనిర్వచనీయమ ని, ఎన్డీఏ కూటమి లక్ష్యం వికసిత భారత్. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని,ఆ ల క్ష్యంలో భాగంగా ఆంధ్రరాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చే సుకుందామని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ తో రా ష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపించుకుందామని పేర్కొన్నా రు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించామని ఈ రాష్ట్రంలో కోటిన్నర మందికి ఉచిత వైద్యం అందించినట్లు, చిన్న సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధిగా రూ.700 కోట్లు ఇచ్చామన్నా రు. కూటమిపట్ల రాష్ట్ర ప్రజల అభిమానం, సిఎం జగన్ రెడ్డి ప్రభుత్వంపై మీకున్న కోపం ఇక్కడకు వచ్చిన జనాభాతో బయటపడిందని, యువతలోని నైపుణ్యాన్ని తట్టిలేపి విద్యా కేంద్రంగా మార్చాలని భావించినట్లు తెలిపా రు.

గుంటూరులో ఎన్‌ఐడీఎం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, తిరుపతిలో ఐఐటీ, కర్నూలు, శ్రీసిటీలో ట్రిపుల్ ఐటీ లు, విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, మంగళగిరిలో ఎయి మ్స్, విజయవాడలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్, తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆ సంస్థలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి, రా ష్ట్ర యువతను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ఏ ర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒక్కసారి మనం తిరిగి చూసుకుంటే దేశంలో భవ్యమైన శ్రీరాముడిని మంది రం నిర్మించుకున్నామని, మన కళ్ల ముందు సాక్షాత్కరించేది ఎన్‌టిఆర్ శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నటించడం కాదు జీవించారని ప్రశంసించారు. ఎన్‌టిఆర్ జీవితాన్ని పేదల కోసం రైతుల హక్కుల కోసం చేసిన పోరాటం వారికి అందించిన సేవను గుర్తు చేసుకోవాలని, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అందరం చూశామన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసిన ఘటనలు గుర్తు చేసుకోవాలని, ఆంధ్రుల ముద్దు బిడ్డ పివిని ఎన్‌డిఏ భా రతరత్న ఇచ్చి గౌరవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావును ఏ విధంగా అవమానించిందో తెలుసుకోవాలని, పార్టీలకు అతీతంగా భారత ముద్దుబిడ్డల్ని గౌరవించుకునేలా ఎన్‌డిఏ ఎప్పుడూ అడుగులు వేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్‌డిఏదేనని, అందులో ఎవరికీ అనుమానం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకపోయిదని నిప్పులు చెరిగారు. మోడీ ఒక వ్యక్తికాదు, భారత దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి, మోడీ అంటే సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసమని పేర్కొన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రదాని నరేంద్రమోడీ అంటూ ప్రశంసంలు కురిపించారు. సంక్షేమానికి కొత్త బాష్యం చెప్పిన వ్యక్తి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News