యువ బౌలర్ నసీం షా
కరాచీ : పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో వివాదం చోటు చేసుకుంది. పాక్ జట్టు అంతర్గత విభేదాలతో సతమతమవుతన్నదన్న ఆరోపణలకు పేసర్ నసీంషా ఆజ్యం పోశాడు. జట్టులో ఏ ఆటగాడైనా గాయం, లేదా మరె ఇతరాత్ర కారణాలతో జట్టు నుంచి తప్పుకునేందుకు సుముఖత చూపరని, వారొకవేళ జట్టుకు దూరమైతే వాళ్ల కెరీర్‌లు ముగినట్టేనని షా కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రిక్ విక్‌తో మాట్లాడిన నసీం షా..
‘నిజానికి మా జట్టు సీనియర్ ఆటగాళ్లు గాయమైనా, పీట్‌గా లేకున్నా వంద శాతం జట్టుకు ఆడాలనే చూస్తారు. ఎందుకంటే మా జట్టులో అభద్రత భావమెక్కువ. అప్పుంటే వారి స్థానాల్లో వచ్చిన కొత్త ఆటగాడు బాగా ఆడితే వారినే జట్టులో కొనసాగిస్తారెయోనని భయపడుతారు. అందుకే రెస్ట్ లేకుండా జట్టుకు ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఒకవేళ రెస్ట్ తీసుకుంటే కెరీర్ ఉంటుందో లేదోనని అభద్రతకు గురవుతారు’ అని ఈ పేసర్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.